తెలంగాణ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ లోని చాంబర్లో కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అధికారులు పాల్గొన్నారు. వేదపండితులు కోమటిరెడ్డిని ఆశీర్వదించారు. తెలంగాణలో కొలువుదీరిన కొత్త మంత్రి వర్గంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం సినిమాటోగ్రపీ శాఖను కేటాయించిన సంగతి తెలిసిందే.
