ఎన్నికల ధృవీకరణ పత్రం స్వీకరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో నల్గొండ నియోజకవర్గం నుండి విజయం సాధించిన అనంతరం రిటర్నింగ్ అధికారి నుండి ఎన్నికల ధృవీకరణ పత్రం స్వీకరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు…

నల్లగొండ జిల్లా కేంద్రంలో నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయాత్ర పెద్దఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలు ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు బాణాసంచాలు పేలుస్తూ సంబరాలు చేశారు. నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ శ్రీకాంత్ చారి వర్ధంతి రోజే తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ అని సోనియమ్మ ఇస్తే కేసీఆర్ ఒక నియంత పాలన నుంచి కుటుంబ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రం ఈరోజు విముక్తి పొందింది అన్నారు. కేసీఆర్ ఆయన కుటుంబం దొంగ మాటలతో ఇంటికో ఉద్యోగం పేరుతో డబల్ బెడ్ రూమ్లో పేరుతో దళితులకు మూడెకరాల పేరుతో ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చాడా.. అని అన్నారు. శ్రీకాంత్ చారి చనిపోయింది తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాలు రావాలని తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారని వారి కోసం మనందరం మౌనం పాటించాల్సింది కోరారు.

కాలిన గాయాలతో డిసెంబర్ మూడో తారీకు జై తెలంగాణ అంటూ ప్రాణాలు వదిలాడని తెలిపారు. తెలంగాణ కోసం అమరులైన అన్ని కుటుంబాలకు తప్పకుండా ఆదుకుంటానని అన్నారు. నా ప్రాణం కంటే ఎక్కువ కార్యకర్తలు అని అన్నాడు. అలాగే అల్లుడైన కొడుకైన ప్రవీన్ అని అన్నారు. 20 రోజులు రాత్రింబవళ్లు కష్టపడి నాకు 54 వేల పై చిలుకు మెజారిటీ ఇచ్చిన నలగొండ ప్రజానికా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. నల్లగొండ చరిత్రలో 70 ఏళ్లలో ఏ ఎమ్మెల్యేకు ఇవన్నీ మెజారిటీ నాకు ఇచ్చారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *