క్రిస్మస్ సందర్బంగా నల్గొండ పట్టణంలోని సెంటినరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బాప్టిస్ట్ చర్చి, క్లాక్ టవర్ సెంటర్లో గల బాప్టిస్ట్ చర్చి, సీబీసీ చర్చ్ లో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనలలో రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రాఫీ శాఖామాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు వారితో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలు పాల్గొన్నారు
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, 27 సంవత్సరాలుగా నగరంలోని చర్చిలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. తనపై ప్రేమతో ఆదరించిన క్రైస్తవ బంధువులకు ప్రత్యేక ధన్యవాదాలు.
“త్యాగం, మానవత్వం కలబోతే యేసుక్రీస్తు అన్నారు”
ప్రపంచంలో నిజం కోసం, ప్రజలకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్దపడిన నిజమైన నాయకుడు యేసుక్రీస్తు అని అయన అన్నారు
-ఇందిరమ్మ రాజ్యంలో సర్వమతాలకు సమాన గౌరవం, గుర్తింపు ఉంటాయని ఆయన అన్నారు. సమానత్వం నిండిన సంక్షేమరాజ్యమే ఇందిరమ్మ రాజ్యమని.. క్రిస్టియన్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం కృషి చేస్తుందని ఆయన అన్నారు.
– ప్రార్థనలు చేసిన అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ తో పాటు 2024 రాబోయే నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు..
– చర్చి పునరుద్ధరణలో భాగంగా ఉన్న సమస్యలను జిల్లా కలెక్టర్ తో మాట్లాడి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
అనంతరం లిటిల్ ఫ్లవర్ ఇన్నోవేటివ్ స్కూల్ లో జరిగిన క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్నారు..
-రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడినందున సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ఉంచుతామని ఆయన అన్నారు.
-ఇప్పటికే ఆరు గ్యారంటీల అమలు పథకాన్ని అమలుపరచడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
-రాష్ట్ర ప్రజలందరికీ పౌర సేవలలో భాగంగా ప్రజా పరిపాలన అందిస్తామని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ పాలన చేరువ చేయడానికి ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.