ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన తరువాత మొదటి సరిగా నల్లగొండకు మంత్రిగా సొంత గడ్డపై అడుగు పెడుతున్న ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి నల్లగొండ బైపాస్ నుండి అడుగు అడుగున పూలతో జన నీరాజనం పలికారు. నల్లగొండలో ఎక్కడ చూసిన కాంగ్రెస్ జెండాలతో వాహనాలు కిక్కిరిసిపోయాయి. ఆయన వెంట ప్రజలు జనసందోహంతో నల్లగొండ రోడ్డులో బారులు తీరారు. నల్లగొండలో ఆయనకు స్వాగతం పలుకుతూ మొదటగా జిల్లా ఎస్పీ కె. అపూర్వరావు పుష్ప గుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున డీజే పాటలతో, బాణసంచా పేలుస్తూ స్వాగతం పలికారు. ఆయన బైపాస్ వద్ద అంబెడ్కర్‌కి అలాగే నెహ్రూకు అలాగే బాబు జగజీవన్‌కి పూల మాల వేశారు. ఆయన వెంట నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ అలాగే జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
హెలికాప్టర్‌తో పూలతో స్వాగతం
నల్లగొండ చరిత్రలోనే కనివిని ఎరుగని విధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాఫ్టర్ నుంచి పూల వర్షం కురిపిస్తు ఘన స్వాగతం పలికారు. ఈ హెలికాప్టర్ పూల వర్షంను చల్లురి మురళీధర్ రెడ్డి మంత్రి మీద ఉన్న అభిమానంతో ఏర్పాటు చేశారు.