ప్రజా పాలన అమలు గురించి ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారుల రివ్వు మీటింగ్

ప్రజా పాలన అమలు గురించి ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారుల రివ్వు మీటింగ్ అనంతరం ప్రెస్ మీట్ లో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రాఫీ శాఖామాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ..

10 సంవత్సరాలుగా బిఆర్ స్ నాయకులు తిన్న లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ పత్రం పేరుతో ప్రజల ముందు పెడతాం, – 6 గ్యారంటీల అమలు పట్ల చిత్తశుద్ధితో ఉన్నాం – ఏర్పడ్డ రెండు రోజుల్లోనే రెండు హామీలను నెరవేర్చాం, – కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, – ఇందిరమ్మ రాజ్యస్థాపన ద్వారా ప్రతి నిరుపేదకు అండగా ఉంటాం, – గత పాలనలో విధ్వంసమైన తెలంగాణను కాంగ్రెస్ పార్టీ సరిచేస్తుంది..

– రాచరిక పాలన పోయి ప్రజల తెలంగాణ వచ్చింది

– అధికారులంతా ఇది మా ప్రభుత్వం.. పేదల ప్రభుత్వామనే ఆలోచనతో పనిచేయాలని నేను కోరుకుంటున్నాను, – 10 యేండ్ల పాలనలో పాన్ డబ్బాలో గంజాయి, విచ్చలవిడిగా బార్లు, వైన్స్, పల్లెకు 10 బెల్ట్ షాపులతో అరాచక పాలన చేసారు. .

పోరాటాల గడ్డ నల్గొండను.. బిఆర్ స్. నాయకులు శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియాగా మార్చేశారు..

– ఇప్పుడు మీరందరు కలిసి కాంగ్రెస్ ప్రభుతాన్ని ఏర్పాటు చేశారు.. అద్భుతమైన అభివృద్ధితో నల్గొండ జిల్లా ను నెంబర్ 1 గా చేసుకుందాం, – ప్రజా పాలన ద్వారా పేదలకి సేవ చేసే అవకాశం వచ్చింది యంగ్ అధికారులు ఒక అవకాశాంగా తీసుకొని పేదలకి అండగా ఉండాలి.., – ప్రజా పాలనకి వచ్చే ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజల మనసు చురగొనాలి, – ప్రతి పేద ఏ ఇబ్బంది లేకుండా, సుఖంగా, సంతోషంగా, సమానత్వంతో జీవించడమే ఇందిరమ్మ రాజ్యం, – మనమందరం కలిసి ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిద్దాం.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలో నెంబర్ 1 గా మార్చుకుందాం

-రాజకీయాలు పక్కన పెట్టి ప్రజా సేవకులుగా మారడానికి ప్రజా ప్రతినిధులకి *ప్రజా పాలన* ఒక మంచి అవకాశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *