యశోద ఆసుపత్రిలో పరామర్శించిన మంత్రి
కేసీఆర్ ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న కోమటిరెడ్డి
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కాంగ్రెస్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. ఇటీవల తన నివాసంలో కేసీఆర్ కాలు జారి కిందపడ్డారు. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి ఆయనను పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.